Wednesday, December 4, 2024

పురుగుల అన్నం విజయమా?… విద్యార్థుల చావులు ఉత్సవమా? : బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగుల అన్నం పెట్టడం ఒక విజయమని, విద్యార్థుల చావులు కాంగ్రెసోళ్లకు ఉత్సవమా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయమా?… వారికి సంకెళ్లేయడం ఉత్సవమా? అని ప్రశ్నించారు. రైతులను మోసం చేయడం విజయమా?… వారికి ఉరితాళ్లేయడం ఉత్సవమా? అని బండి నిలదీశారు. ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయమా?… వారి కన్నీళ్లతో ఉత్సవం చేయడం గెలుపా? అని అడిగారు. ఇళ్లు ఇస్తామని మోసం చేయడం విజయమా?… ఉన్న ఇళ్లు కూల్చడం ఉత్సవమా? అని చురకలంటించారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పడం విజయమా?… అప్పులకు నోటీసులివ్వడం ఉత్సవమా? అని మండిపడ్డారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా?… ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అని ధ్వజమెత్తారు. ఇవి విజయోత్సవాలు కాదు వికృత ఉత్సవాలు అని బండి ఘాటు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News