Thursday, January 23, 2025

కాంగ్రెస్ ఫీల్డు నుంచి తప్పుకుంది: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫీల్డు నుంచి తప్పుకుందని ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు రెండు కలిసి పోటీ చేయవచ్చని కోమటిరెడ్డి మాటల్లో అర్ధమవుతుందని అన్నారు. బిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పార్టీని కాపాడుకోవాలనే తపనతో బిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో ఒక అవగాహనతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలను తాజాగా కాంగ్రెస్ నేతలు బయటపెడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారని స్పష్టమవుతోందని అన్నారు. ఎన్నికల వరకు కొట్లాడినట్లుగా ఈ పార్టీలు నటిస్తున్నాయని, ఇదో దండుపాళ్యం ముఠా అని ఆయన విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారంతా బిఆర్‌ఎస్ పార్టీలో చేరారని, ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు.

మంగళవారం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.. తెలంగాణలో 119 స్థానాల్లో గెలిచి బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపికి ఒక్కసీటు కూడా రాదని బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, అలాగైతే బిజెపికి ఆ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్‌ను పొగడుతూ, బిజెపిని, ప్రధాని మోడీని బిఆర్‌ఎస్ నేతలు తిట్టడమే పనిగా మాట్లాడారని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ బిజెపిలోనే ఉంటారని బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్ళరని బండి సంజయ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News