Thursday, January 23, 2025

బండి సంజయ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. సైబరాబాద్ హోంగార్డ్ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హోంగార్డులపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సైబరాబాద్ హోంగార్డ్ అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. రాజకీయాలతో సంబంధంలేకుండా నిరంతరం శ్రమిస్తున్న హోంగార్డులను తక్కువ చేస్తు వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. కరోనా సమయంలో హోంగార్డులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 16,000 మంది హోంగార్డుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

తమ సమస్యలపై బండి సంజయ్ ఎన్నడూ మాట్లాడలేదని, రాజకీయాల కోసం తమ పేరు వాడడం సరికాదని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి హోంగార్డు నిరసన తెలియజేస్తున్నారని అన్నారు. తాము విధులు నిర్వర్తిస్తామని, రాజకీయ పార్టీలకు వంతపాడమని తెలిపారు. అంతగా అభిమానం ఉంటే తమ సంక్షేమం కోసం మాట్లాడాలని, పోరాడాలని కోరారు. ఇకముందు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడకూడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News