Wednesday, January 22, 2025

పేదలకు మేలు చేసే పథకాలను అడ్డుకోం : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డబ్బుల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ దివాళా తీసిన సర్కారు ఖజానా కోసమే ముందస్తు మద్యం టెండర్లు అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను బిజెపి అడ్డుకోదని స్పష్టం చేశారు. తాను ఎక్కడ పోటీ చేయాలో పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఎంపిలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరు గార్చేశారని ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారంటూ విమర్శించారు. పెద్దపల్లి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి‘ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News