Wednesday, January 22, 2025

మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణం లవ్ జిహాదే: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి లవ్ జిహాదే కారణమంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిందూ బాలికలపై కుట్ర జరుగుతోందని, ఇది లవ్ జిహాద్ కేసని స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. హిందూ అమ్మాయిలకు ముస్లింలు వల వేస్తున్నారని, వారికి విదేశాల నుంచి పెడ్డమొత్తంలో డబ్బు బదిలీ అవుతోందిని ఆయన అన్నారు.

మహిళలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ పేరుతో వారిని వేధిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసును నీరుగార్చేందుకే నిందితుడిపై తేలికపాటి సెక్షన్లతో కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ద్యాగింగ్ కారణంగానే కాకతీయ వైద్య కళాశాల పిజి విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని, కాని పోలీసులు కేనుసు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

విద్యార్థినికి మెరుగైన వైద్యం అందిస్తున్నామనే కారణం చెప్పి సమయాన్ని వృథా చేస్తున్నారని, విద్యార్థి సంఘాల ఆందోళనలను చల్లార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి వేధింపులకు పాల్పడిన సీనియర్ విద్యార్థి పట్ల సానుభూతి చూపుతున్నారని ఆయన అన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసుపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News