హైదరాబాద్: సచివాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం అందిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తాను సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లనని చెప్పారు. సచివాలయ నిర్మాణం, డిజైన్ ఓ వర్గాన్ని సంతృప్తిపరిచే రీతిలో ఉందని, ఓవైసి కళ్లల్లో ఆనందం చూడటం కోసమే సచివాలయ కట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. స్ట్రక్చర్ చూశాక సచివాలయం అనే భావన కలగడం లేదని బండి సంజయ్ చురకలంటించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్‌లో మార్పులు జరగాలన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఎవరు సిఎంగా ఉన్న సచివాలయంలోకి ప్రవేశించనని స్పష్టం చేశారు. గుమ్మటాలను కూల్చి డిజైన్ మార్చాకే అడుగుపెడుతానని వివరించారు. నల్లపొచమ్మ ఆలయాన్ని కూల్చివేశారని బండి సంజయ్ దుయ్యబట్టారు. గుడికి రెండున్నర గుంటలు, మసీదుకు ఐదు గుంటలా? అని ప్రశ్నించారు. దీనిపై హిందూ సమాజం అంతా ఆలోచించాలన్నారు.
Also Read: దళిత బంధులోఅవినీతి… వారిపై చర్యలు తీసుకోండి… సామాజిక కార్యకర్త లేఖ