Saturday, April 19, 2025

సోనియా, రాహుల్ బెయిల్ మీద ఉన్న నిందితులు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్లు కాజేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 2011లో యుపిఎ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభమందన్నారు. కేసు నమోదైనప్పుడే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెయిల్ పొందారని, సోనియా, రాహుల్‌లు బెయిల్ మీద ఉన్న నిందితులని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని.. భారతీయ చట్టాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వర్తించవా అని ప్రశ్నించారు. 12 ఏళ్ల విచారణ తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్ దాఖలైందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News