Thursday, March 20, 2025

6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ ఓం భూం…బుష్. అబద్దాల్లో, అంకెల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్‌ఎస్ సర్కార్‌ను కాంగ్రెస్ సర్కార్ మించిపోయిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ తీరు చూస్తుంటే ఆరు గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేని బడ్జెట్‌గా అభివర్ణించారు. మేనిఫెస్టోలోని పది శాతం హామీలను కూడా అమలు చేయలేని అసమర్ధ సర్కారని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. విద్య, వైద్య రంగాల కేటాయింపులు దారణంగా ఉన్నాయని అన్నారు. అభయ హస్తం కాదు..మహిళల పాలిట శూన్య హస్తమని ఈ బడ్జెట్ నిరూపించిందని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఊసేలేదని అన్నారు. వృద్దుల పెన్షన్ పెంపును గాలికొదిలేశారని, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశారని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్, పెండింగ్ బిల్స్ అన్నీ ఇగ ఎగవేసినట్లేనా? అని ప్రశ్నించారు. గోబెల్స్‌ను మించిన అబద్దాల కోరులు కాంగ్రెస్ నేతలు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను పరిశీలిస్తే…డొల్ల అని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక చిత్తుకాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 420కిపైగా హమీల్లో 10 శాతం కూడా అమలయ్యే అవకాశం కన్పించడం లేదని తెలిపారు. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా, ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదని అన్నారు. కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.

బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటని అన్నారు. బాధాకరమైన విషయం ఏమ ంటే బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బిల్స్ సహా మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ అన్నీ ఇగ ఎగవేసినట్లే కన్పిస్తోంది. అట్లాగే బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకంటే మైనారిటీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైనట్లుగా తేట తెల్లమైందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News