Thursday, April 3, 2025

బిఆర్ఎస్ పేరుతో తెలంగాణకు మోసం: బండి సంజయ్‌

- Advertisement -
- Advertisement -

కరీంనగర్‌: భారాస పేరుతో సిఎం కెసిఆర్‌ తెలంగాణకు మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి సిఎం సహకరించడం లేదు. ఏపి, తెలంగాణ సిఎంలు ఏకమయ్యారని, దోచుకొని.. కమీషన్లు దాచుకుందామని అనుకున్నట్లు ఆయన అన్నారు. ప్రజలు తిరస్కరిస్తే జై తెలంగాణ అని నేనంటా.. జై ఆంధ్రా అని నేనంటా అంటూ ఇద్దరూ మాట్లాడుకున్నారని అన్నారు. రెండు రాష్ట్రాల నాయకుల చరిత్రను ప్రజలు గుర్తుంచుకొవాలి అని బండి సంజయ్‌ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News