Thursday, December 26, 2024

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం కాదు:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్‌కు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని బిజెపి జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని తాటిపెల్లి, లంబాడిపల్లి, తక్కల్లప ల్లి, మ్యాడంపెల్లి, మద్దుట్ల, పోతారం గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి నరేంద్రమోడీనే గ్యారంటీ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసగించిందని విమర్శించారు. కెటిఆర్ ఇంకా అధికారం మత్తులోనే ఉన్నారని, ప్రజలు ఛీకొట్టినా కల్వకుంట్ల కు టుంబానికి ఇంకా బుద్ధి రాలేదని దుయ్యబట్టారు. సంక్షేమంలో దశాబ్దాల తరబడి పాలించిన కాగ్రెస్ పాలన కంటే మోడీ ఎన్నో రేట్లు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సమయస్ఫూర్తితో ప్రజలు కరోనా మహమ్మారి బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారని, వేలాది రూపాయల విలువ చేసే కరోనా టీకాలను ఉచితంగా పంపిణీ చేసి ప్రజలను కాపాడుకున్న ఉత్తమ ప్రధాని నరేంద్రమోడీ అని కొనియాడారు.

ఐదు శతాబ్దాల హిందువుల కలను నిజం చేస్తూ అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మించి ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు నరేంద్రమోడీ అన్నారు. తాను ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం చేసిన పోరాటమే తనను నాయకుడిని చేసిందన్నారు. వంద కేసులు పెట్టి తనను గత ప్రభుత్వం నిర్బంధించినప్పటికీ ఏ రోజు కూడా వెనుకంజ వేయకుండా నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నారు. కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధ్ది కార్యక్రమాలను మొన్నటి వరకు కెసిఆర్, ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రం నిధులను తాము ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంతకుముందు మాజీ ఎంఎల్‌ఎ బొడిగే శోభ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ కా ర్యక్రమంలో బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, నాయకులు బింగి వేణు, నేరేళ్ల శ్రవణ్, మల్లేశం, వెంకటస్వామి, లత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News