Thursday, February 20, 2025

రాహుల్ గాంధీపై బండి సంజయ్ విమర్శలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కులం, మతం, జాతి లేని వ్యక్తి అని రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్‌నని తెలిపారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం కావాలని స్పష్టం చేశారు. అలా కాకుండా రాహుల్ మాత్రం బ్రాహ్మణ అంటున్నారని బండి అన్నారు. తండ్రి కులమే కొడుకుకు ఎందుకు రాలేదో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని బండి కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ఇండియన్‌ అని  బండి చెప్పారు. లవ్ జిహాదీ, దీంతో పాటు మత మార్పిడులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం తేవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News