Sunday, December 22, 2024

రేవంత్‌కు బండి కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌కు పదవి పోతుందని భయం పట్టుకుందని విమర్శించారు. బిఆర్‌ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బు తీసుకున్నదని నిజమన్నారు. కాంగ్రెస్ పూర్తిగా బిఆర్‌ఎస్ చేతిలోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయన్నారు.

పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడికి అందరూ రావాలనేది తన కోరిక నెరవేరిందన్నారు. రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ ఎక్కడా అనలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే ఈటెల అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత గోడవలతో రేవంత్ సతమతమవుతున్నారని దుయ్యబట్టారు.

Also Read: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో ఆటలా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News