Thursday, January 30, 2025

గద్దర్‌పై బండి విమర్శలు కరెక్ట్ కాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గద్దర్‌పై బిజెపి ఎంపి బండి సంజయ విమర్శలను కోమటిరెడ్డి తప్పుబట్టారు. ఊరువాడా తిరిగి తెలంగాణ కోసం ఆయన పోరాడారని గుర్తు చేశారు. గద్దర్‌పై బండి విమర్శలు కరెక్ట్ కాదు అని దుయ్యబట్టారు. బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ ఉన్నాడా? బండి సంజయ్‌ ఉన్నాడా? అని అడిగారు. ఊరూరు తిరిగి పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ఆయన చనిపోతే ప్రధాని మోడీ కూడా నివాళులర్పించారని, కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్‌ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు.

సామాన్యుల నుంచి ఆర్జీలు తీసుకుంటున్నామని, ప్రజలతో మంత్రుల ముఖాముఖి మంచి కార్యక్రమం అని ప్రశంసించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామన్నారు. నల్లగొండలో బిఆర్‌ఎస్ మీటింగ్‌కు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అట్టర్ ప్లాప్ అయిందని విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ నల్లగొండను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నల్లగొండ ప్రాజెక్టులను బిఆర్‌ఎస్ పడావు పెట్టిందని, 70 శాతం పనులు పూర్తయినా ఎస్‌ఎల్‌బిసిని బిఆర్‌ఎస్ ఎందుకు పట్టించుకోలేదన్నారు.

300 ఎకరాల్లో నల్లగొండలో మహాత్మాగాంధీ వర్సిటీ ఏర్పాటు చేయించామని, కేవలం ఎన్నికల కోసమే నల్లగొండలో ఐటి టవర్ ఓపెన్ చేశారని ధ్వజమెత్తారు. 300 ఎకరాల్లో నల్లగొండలో మహాత్మాగాంధీ వర్సిటీ ఏర్పాటు చేయించామని, తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలిపెట్టి పోరాటం చేశానని, ప్లోరైడ్ నిర్మూలన కోసమే నిరాహార దీక్షలు చేశామన్నారు. అమెరికా నుంచి డైరెక్ట్‌గా వచ్చి కెటిఆర్ ఎంఎల్‌ఎ అయ్యారని, కెటిఆర్, హరీష్ రావు తన కాలి గోటికి సరిపోరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. కెసిఆర్ కొడుకుగా, అల్లుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చారని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News