Monday, January 20, 2025

బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

- Advertisement -
- Advertisement -

విచారణ 20కి వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంలో బిజెపి నేత, ఎంపి బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాంగ్మూలాన్ని అడ్వొకేట్ కమిషనర్ నమోదు చేశారు. కరీంనగర్ ఎంఎల్‌ఎగా గంగుల కమలాకర్ ఎన్నికను కొట్టివేసి, తనను ప్రకటించాలని కోరుతూ బండి సంజయ్ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం విశ్రాంత జిల్లా జడ్జిని అడ్వొకేట్ కమిషనర్‌గా హైకోర్టు నియమించింది. అడ్వొకేట్ కమిషనర్ ఎదుట బండి సంజయ్ గతంలో హాజరై వివరాలు సమర్పించి, వాంగ్మూలం ఇచ్చారు.

పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని గంగుల కమలాకర్ తరపు న్యాయవాది కోరడంతో అడ్వొకేట్ కమిషనర్ అంగీకరించారు. పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన తదితర కారణాలతో క్రాస్ ఎగ్జామినేషన్‌కు పలుమార్లు వాయిదా కోరడంతో ఇటీవల హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సైనిక సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాలని బండి సంజయ్‌ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించిన సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై విచారణ సెప్టెంబర్ 20న జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News