Thursday, January 23, 2025

బిజెపి కార్పోరేటర్ల అరెస్టు దారుణం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి కార్పోరేటర్లను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం జిహెచ్‌ఎంసి సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తుంటే తమ పార్టీ కార్పోరేటర్లను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.

జిహెచ్‌ఎంసి బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రజా సమస్యలపై గొంతెత్తిన బిజెపి కార్పోరేటర్లను మార్షల్స్‌ను ద్వారా గెంటించివేసి బడ్జెట్‌ను ఆమోదించుకోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం అరెస్టు చేసిన బిజెపి కార్పోరేటర్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News