Monday, December 23, 2024

కాంగ్రెస్ కు ఆరు స్కీములు.. అరడజను సిఎంలు

- Advertisement -
- Advertisement -

భైంసా: కెసిఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదు.. ప్రజలందరి పోరాటం వల్ల వచ్చిందని బిజెపి మాజీ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా మండలంలో బిజెపి నేత బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో ఆయన అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఆదరణ చూసి కెసిఆర్ భయం పుట్టిందన్నారు. ఈ 9 ఏళ్ల్లల్లో ఈ పనులు చేశామని కెసిఆర్ ఎక్కడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. కెసిఆర్ చెప్పుకునేందుకు ఏమీ లేక కేవలం విపక్షాలను తిడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పని ఖతం అయ్యిందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. కర్నాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు స్కీమ్ లు అరడజను ముఖ్యమంత్రులు ఉంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లోకి వెళ్లకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసిన వృథానే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News