Wednesday, January 22, 2025

గన్‌పార్క్ వద్ద టెన్షన్ టెన్షన్… బండి, ఈటెల అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తన కార్యకర్తలో కలిసి టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీపై గన్‌పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు సంజయ్ తో కాసేపు చర్చలు జరిపారు. గన్‌పార్క్ నుంచి టిఎస్‌పిఎస్‌పికి వెళ్తున్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు, నిరుద్యోగులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.

బిఎస్‌పి ఆఫీస్‌లో దీక్ష చేస్తున్న బిఎస్‌పి నేత ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి ఇంటికి తరలించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కేసుపై సిబిఐతో విచారణ జరిపించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News