- Advertisement -
కరీంనగర్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాజీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం అంటూ కెసిఆర్ పై పైర్ అయ్యారు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఎక్కడ? బయటకు రండి.. ప్రజలకు వాస్తవాలు చెప్పండి అని బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో మోటార్లు మునిగిపోయాయని అన్నారు. నేడు ఆ ప్రాజెక్టు కుప్పకూలింది. కేసీఆర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అని చెప్పుకున్నది నువ్వే. జాతీయ హోదా ఇస్తే మన పరువు పోతుంది. కెసిఆర్ వ్యవహారశైలి దేశంలోనే తెలంగాణను నవ్వులపాలు చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
- Advertisement -