Thursday, January 23, 2025

శ్రీరాముడి వారసుడే.. మా ప్రధాని అభ్యర్థి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. శ్రీరాముడి వారుసుడని బిజెపి ఎంపి బండి సంజయ్ అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆయోధ్యలో రామమందిరం నిర్మించారని చెప్పారు. 70ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు. హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బిజెపి సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆ శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి అని అన్నారు. కాని, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.

తెలంగాణ వంద రోజులు దాటిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ కు చుక్కలు కనిపిస్తాయని వార్నింగ్ ఇచ్చారు. రేషన్ కార్డు నిబంధన పెట్టి లక్షల మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ సర్కార్ కోత పెట్టిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News