Wednesday, January 22, 2025

బిసిలను అవమానించిన కెటిఆర్: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ జోష్యం చెప్పారు. ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ బిసి వర్గాల ప్రజలను దారుణంగా అవమానించారని ధ్వజమెత్తారు. బిజెపి అధికారంలోకి రాగానే బిసి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన తరువాతే కెటిఆర్ కు బిసి కులం కంటే గుణం ముఖ్యమనే మాటలు గుర్తుకొచ్చాయా? అంటూ మండిపడ్డారు. ‘గుణమే ముఖ్యమనే కెటిఆర్… బిఆర్‌ఎస్ పార్టీలో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిసి ప్రజలతోపాటు పేదలంతా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. కొడుకు చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పిన తరువాత ఆయా వర్గాల ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

ఈసారి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరబోతోంది. ఒక్క కరీంనగర్ లోనే కాదు…తెలంగాణలో సైతం బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతోంది. అందుకే దేశంలో ఎక్కడా ఏ పార్టీ ప్రకటించని విధంగా బిజెపి నాయకత్వం బిసి నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిందన్నారు. బిసి వర్గంలోని పేదరికం నుండి వచ్చిన నాయకుడిని సీఎం చేస్తామని ప్రకటించిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ బిజెపి అన్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు కరీంనగర్ లో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికారు కదా? మరి ఎందుకు పోటీ చేయడం లేదు ? పెద్ద ఎత్తున ఎంఐఎం నాయకులకు బీఆర్‌ఎస్ డబ్బు సంచులు ముట్టినయని ఆరోపించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకున్న మాట వాస్తవం కాదా? 2013లో కెసిఆర్ తన కుటుంబాన్ని తీసుకెళ్లి సోనియాగాంధీకి పాదాభివందనం చేసి విలీనం చేస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? బిఆర్‌ఎస్ తో కలిసి అధికారం పంచుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ గమనించిన తరువాతే అమిత్ షా తెలంగాణ పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బిసి వ్యక్తిని సీఎంను చేయాలని నిర్ణయించారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యిందని పేర్కొన్నారు. ఆ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లే రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. బిఆర్‌ఎస్‌కు బిజెపి ప్రత్యామ్నాయమా? కాదా? తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్ చేతిలో ఉందన్నారు. రైతులే కాదు నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలతోపాటు అన్ని వర్గాల పేదలు కేసీఆర్ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. కులం కాదు.. గుణం ముఖ్యమని కేసీఆర్ కొడుకు అంటున్నడు….అంటే బీసీల్లో గుణం ఉండదా? కేసీఆర్ కుటుంబానికి మాత్రమే గుణం ఉన్నట్లా? బీసీలను పూర్తిగా అవమానించడమే అన్నారు. బీసీలను సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిన వెంటనే కులం కాదు.. గుణం ముఖ్యమని అన్నారంటే.. బీసీలను ఎంతగా అవమానిస్తున్నారో ప్రజలు ఆలోచించాలని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News