మన తెలంగాణ/హైదారాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు అమ్ముడు పోయారంటూ బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్ బహిరంగంగా భగ్గుమన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. ప్రమోషన్లు, నచ్చిన చోట పోస్టింగులు, కమిషన్ల కోసం సిఎం కెసిఆర్ గడి వద్ద కాపలా కాస్తున్నారంటూ విమర్శించారు. ప్రతి నెల ఒకటో తేదీకి జీతాలు ఇవ్వనందుకు ఉద్యోగ సంఘాల నేతలు అమ్ముడు పోయారా? అని ప్రశ్నించారు. పెన్షన్ ఇవ్వనందుకా? 310 జివో దేని కోసం, టిఆర్‌ఎస్ సర్కార్‌కు మద్దతు ఇస్తున్నారంటూ ఉద్యోగుల పట్ల అవమానకరంగా ఆయన మాట్లాడారు. 310 జివోతో చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున అందరూ ఇబ్బందులు పడుతున్నారని, కానిస్టేబుళ్లు ఏడుస్తున్నారని బాధ్యతరహితంగా వ్యాఖ్యానించారు. ఉద్యోగుల కోసం పని చేయని సంఘాల నాయకులు ఎందుకని?, సర్కార్‌కు అనుకూలంగా పనిచేస్తున్న ఉద్యోగులపై కేసులు పెట్టాలన్నారు. టిఎన్‌జివో నాయకులు ఎవరి కోసం పని చేస్తున్నారని, దమ్ముంటే ఇప్పుడు టిఎన్‌జివో ఎన్నికలు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు బండి సంజయ్‌పై మండిపడ్డారు.
Bandi Sanjay fires on TNGO Employees