Friday, December 20, 2024

వేదికనెక్కిన విభేదాలు

- Advertisement -
- Advertisement -

మన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మరోసారి ఆ పార్టీలో బయటపడ్డా యి. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయడం ఆపండని.. కార్యకర్తలతో జీవితాలతో ఆడుకోవద్దని రాష్ట్ర అసంతృప్తి నేతలపై పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వేదికపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా సరి గ్గా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. పార్టీలో కీల క నాయకురాలు విజయశాంతి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. మీడియాలో ఈ విష యం వైరల్ కావడంతో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో నా డు ప్రత్యేక తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారు వేదికపై ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు అక్కడ ఉండడంతో తా ను అసౌకర్యంగా ఫీల్ అయ్యాయని విజయశాంతి తెలిపారు.

అలాంటి వేదికపై చివరివరకు ఉం డడం అసాధ్యమని, అందుకే మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టత ఇచ్చారు. మాజీ సిఎం నల్లారి కి రణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్య లు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అ నంతరం జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపికి ఈ స్థాయిలో జోష్ వచ్చిందంటే అందుకు బండి సంజయ్ కారణమని వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ‘బండి సంజయ్‌ను చూసి కళ్లలో నీళ్లు తిరిగితే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చి వచ్చాను. కెసిఆర్‌కి వ్యతిరేకంగా బండి సంజయ్ తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. బండి సంజయ్‌ను పార్టీ గుండెల్లో పెట్టుకోవాలి’ అని కోరారు.

మరోవైపు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకారానికి మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంఎల్‌ఎ ఏనుగు రవీందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి దూరంగా ఉన్నారు. వీరంతాబిజెపి అధిష్టానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు పార్టీలో కొనసాగే విషయంపైనా తర్జనభర్జన పడుతున్నారని, త్వరలోనే కండువా మార్చబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం హాజరు కాకపోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. సమయంలో పలువురు అసంతృప్త నేతలు కిషన్ రెడ్డి కార్యక్రమానికి తరలివచ్చారు. ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయ శాంతి, వివేక్ వెంకటస్వామి, యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.

సంజయ్ వీరాభిమాని అజయ్‌వర్మ ఆత్మహత్యాయత్నం
బండి సంజయ్‌ను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేక కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మానకొండూరు నాయకుడు సొల్లు అజయ్ వర్మ పురుగుల మందు తాగారు. శుక్రవారం కిషన్‌రెడ్డి కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగాన్ని టీవీలో వీక్షిస్తూ తీవ్ర ఉద్వేగానికి గురైన అజయ్ వర్మ పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సంజయ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని, ఆయనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నానంటూ అజయ్ వర్మ ఏడ్చినట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు వెల్లడించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మొదటగా కరీంనగర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News