Monday, December 23, 2024

ఢిల్లీకి బండి సంజయ్‌.. పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికొద్దసేపట్లో ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. హుటాహుటిన బండి సంజయ్ ఢ్లిలీకి వెళ్లనుండడంతో ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బిజెపి నైరాశ్యంలో పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో బిజెపి పుంజుకోవాలంటే.. కెసిఆర్ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని అసంతృప్తి నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు.

ఈ చర్చల అనంతరం బండి సంజయ్‌కి హైకమండ్ నుంచి పిలుపు రావడంతో..అసలు ఏం జరుగుతోందని పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఈటల, రాజగోపాల్‌లతో జరిగిన చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలు, బండి సంజయ్‌కి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయి: థాక్రే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News