Wednesday, January 22, 2025

ఢిల్లీకి వెళ్లనున్న బండి… సిపి రంగనాథ్ పై ఫిర్యాదు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి రావాలని బండి సంజయ్‌కు పార్టీ హైకమాండ్ పిలిచింది. తెలంగాణలో పరిణామాలపై కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డి చేరికలపై చర్చించే అవకాశం ఉంది. వరంగల్ సిపి రంగనాథ్‌పై హోంశాఖకు సంజయ్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

Also Read: ప్రేమ… మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. ప్రియురాలు ధర్నా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News