Monday, December 23, 2024

ఇంజనీర్లందరకీ ఇంజనీరింగ్ దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Bandi Sanjay greets engineers on Engineers Day

హైదరాబాద్: భారత రత్న స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్లందరకీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇంజనీరింగ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ భారత దేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజున ‘ఇంజనీర్స్ డే’ గా జరుపుకోవడం సంతోషకరమన్నారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని బండి కొనియాడారు. హైదరాబాద్ మహా నగరాన్ని మూసీ వరదల నుండి కాపాడిన మహనీయుడు విశ్వేశ్వరయ్య అన్నారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కీలక సూత్రధారని బండి పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన కృష్ణరాజసాగర్‌ ఆనకట్ట (కావేరీ నదిపై నిర్మించారు)ను నిర్మించిన ఘనత మోక్షగుండం విశ్వేశ్వరయ్యకే చెందుతుందన్నారు. ‘ఇంజనీర్స్ డే’గా సందర్భంగా విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం ఆయనకు అందించే ఘన నివాళి అని బండి సంజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News