Saturday, December 21, 2024

విజయ సంకల్ప సభ .. సంచలనం కావాలి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

బిజెపి నేతలకు బండి సంజయ్ పిలుపు
జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర నేతలతో టెలి కాన్ఫరెన్స్

హైదరాబాద్ : చేవెళ్లలో జరిగే విజయ సంకల్ప సభ రాష్ట్రంలో సంచలనం కావాలని.. పార్టీ గెలుపు ఖాయమనే సంకేతాలను సభ ద్వారా పంపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ అన్నారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నేతలతో టెలికాన్ఫరెన్స్‌ను ఆయన నిర్వహించారు. ఆదివారం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో సభ విజయవంతానికి బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు లక్ష మందికి తగ్గకుండా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, కార్యకర్తలంతా స్వచ్ఛందంగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలన్నారు. పార్లమెంట్ పరిధిలో జరగబోయే తొలి సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణలో బిజెపి గెలుపు ఖాయమనే నమ్మకాన్ని జాతీయ నాయకత్వానికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నియంత, అవినీతి పాలన కొనసాగుతోందని, దీంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, పార్టీ అండగా ఉన్నందుకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు.

కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని, తెలంగాణలోనూ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. చేవెళ్ల సభ ద్వారా తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం.. రామరాజ్య స్థాపన తథ్యమనే సంకేతాలను పంపబోతున్నట్లు చెప్పారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News