Thursday, December 19, 2024

ఐదేళ్లలో రూ. 12 వేల కోట్ల నిధులు తెచ్చా: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జోరు పెంచారు. ఆదివారం కరీంనగర్ లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కరీంనగర్ కు ఐదేళ్లు లో రూ. 12 వేల కోట్లు నిధులు తెచ్చానని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ లో పోటీకి కాంగ్రెస్ కు అభ్యర్థులు కూడా లేరని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా వేళ కరీంనగర్ ప్రజలకు అనేక సేవలు అందించానని గుర్తుచేశారు. కరోనాతో 8 మంది బిజెపి కార్యకర్తులు చనిపోయారన్న బండి సంజయ్ కరోనా వేళ బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అసలు బయటకు రాలేదని ఆరోపించారు. రైతులకు నష్టంపరిహారం ఇవ్వాలని పోరాడింది తామేనని గుర్తుచేశారు. రైతు రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బండి ద్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News