Monday, December 23, 2024

బిజెపి సింహం.. సింగిల్ పోటీ చేస్తోంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్నాటకలో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ఆ పార్టీలకు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ గురువారం గౌరిబిదనీరు, బాగేపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డి.పాళ్యలో ఓటర్ల వద్దకు వెళ్లి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించారు.

ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించే ప్రమాదం ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను పెంచే కుట్ర జరుగుతోందన్నారు. కర్ణాటకలో బిజెపికి మెజారిటీ సీట్లు రాబోతున్నయ్. మళ్లీ అదికారంలోకి రాబోతున్నం. కాంగ్రెస్, జేడీఎస్ ఎంత డబ్బు వెదజల్లినా తమ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. పలు పార్టీలు కలిసి గుంట నక్కల్లా పోటీ చేస్తున్నయ్… బిజెపి సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేస్తుందన్నారు.

 బాగేపల్లిలో రోడ్ షో.. : పార్టీ జాతీయ కార్యదర్శి సిటి రవి, బాగేపల్లి అభ్యర్థి మునిరాజుతో కలిసి బాగేపల్లి నేషనల్ కాలేజీ నుంచి బస్టాండ్ వరకు బండి సంజయ్ నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. బిజెపి అభ్యర్ధికి ఓటేయాలని అభ్యర్ధిస్తూ… ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News