Saturday, November 16, 2024

వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” లక్ష్యమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగ స్వాములై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. శనివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రచార రథంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాన్ని లైవ్‌లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోడీ ఈ పదేళ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గొంతెత్తి మాట్లాడలేని పేదల కోసం గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందిస్తున్నా రని పేర్కొన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించారన్నారు.

కోట్లాది మంది రైతులకు సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నారని, కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదు జమ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉజ్వల్ యోజన కింద ఉచితంగా కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లు అందించారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు అర్హులకు ఈ పథకాలను చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాములై నిజాయితీగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మారుమూలన ఉన్న గ్రామాలు కూడా అభివృద్ధ్ధి చెందాలిఅన్నారు. తద్వారా భారత్‌ను నెంబర్ వన్ గా తీర్చిదిద్ది విశ్వగురుగా మార్చాలన్నదే మోడీ లక్ష్యమన్నారు. ఆ గొప్ప ఆశయానికి అండగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నామని బండిసంజయ్ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News