Sunday, January 19, 2025

చంద్రబాబు అరెస్టు సరికాదు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎపి ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం సరికాదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ అన్నారు. ఎఫ్‌ఐఆర్ లో పేరు లేకుండానే ముఖ్యమంత్రిగా సుధీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమంజం కాదన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో టిడిపికి ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.

విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి..
సిద్దిపేట జిల్లా శనిగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ఎంపి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 8 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News