Sunday, December 22, 2024

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. కోరుట్లలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరుట్లలో పోలీసులు అరెస్టు చేసి, కరీంనగర్‌కు తరలించారు. దీంతో ఆయన పోలీసులపై మండిపడ్డారు. పాదయాత్రకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయన్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక హఠాత్తుగా ఈ రద్దు నిర్ణయం ఏంటని బండి సంజయ్ పోలీసులపై మండిపడ్డారు.

భైంసా సున్నిత స్థానం అంటున్నారని, అదేమైనా నిషేదిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు వెళ్లవద్దో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భైంసానే కాపాడలేని సిఎం ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చేతకాక పోతే ఇంట్లో కూర్చొవాలని అన్నారు. తనను అరెస్టు చేయడం పై బండి సంజయ్ ఈ సందర్బంగా స్పందిస్తూ పోలీసుల వినతి మేరకు ఇప్పుడు కరీంనగర్‌కు వెళ్తున్నానని, సోమవారం మధ్యాహ్నం వరకు తమకు సమయం ఇచ్చారని అప్పటి దాకా వేచి చూస్తామన్నారు.

కార్యకర్తల ఆందోళన
కాగా బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడం పట్ల కార్యకర్తలు తమ నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి , పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని వారించి అక్కడి నుండి పంపించి వేయడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News