హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. విషయం తెలిసి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. హెచ్ సియు సందర్శనకు వెళ్తున్న బిజెపి నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో బండి మీడియాతో మాట్లాడారు. కంచె గచ్చిబౌలిలోని భూములను వేలం వేయడం కుదరదన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ప్రభుత్వం వేలం వేయాలనున్నకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని స్పష్టం. బిఆర్‌ఎస్‌ను మించి కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గచ్చిబౌలి భూముల అమ్మకం నిర్ణయాల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బండి చురకలంటించారు.
అంతకుమందు హెచ్‌సియు సందర్శనకు బయలుదేరిన బిజెపి నేతలను అరెస్టు చేశారు. హైదర్‌గూడ వద్ద ఎంఎల్‌ఎ క్వార్టర్స్ వద్ద బిజెపి ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలను అడ్డగించారు. హెచ్‌సియు సందర్శనకు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అరెస్టు చేశారు.