Friday, November 22, 2024

రహస్య ఒప్పందం… అందుకే కెటిఆర్‌ను అరెస్ట్ చేయడంలేదు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హంగామా చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. జన్వాడ ఫామ్‌హౌస్ కేసులో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు రాజీ పడ్డాయని ఆరోపణలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బిజెపికి తావులేకుండా చేయాలని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ పార్టీ అనేది ఇప్పుడు లేదని, ఇక ముందు కూడా ఉండదని తెలియజేశారు.

ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీకి బిఆర్‌ఎస్‌కు అభ్యర్థులు దొరకడం లేదని, బిఆర్‌ఎస్‌లో కెసిఆర్ కుమారుడు కెటిఆర్‌ను ఎవరు పట్టించుకోవడంలేదని బండి సంజయ్ కుమార్ చురకలంటించారు. బిఆర్‌ఎస్‌లో విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎంఎల్‌ఎ హరీష్ రావు అని, రేవంత్ బిడ్డ పెళ్లికి వెళ్లకుండా ఆయనను జైలు పంపారు గుర్తుందా? సిఎంను నిలదీశారు. జైలుకు పంపిన వారితో రాజీ పడుతున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్, కెటిఆర్ మధ్య రహస్య ఒప్పందం ప్రకారం కెటిఆర్‌ను అరెస్ట్ చేయడంలేదన్నారు. రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని బిఆర్‌ఎస్ ప్రచారం చేయడంపై మండిపడ్డారు. తాను, రేవంత్ ఒక్కటేనని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పాలని బండి సంజయ్ కుమార్ అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News