Wednesday, January 22, 2025

తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వును వినియోగించడం నీచం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమల లడ్డూ కల్తీ అంశం హిందువుల మనోభావాలను కలిచి వేసిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తిరుమల లడ్డూ కల్లీ వ్యవహారంపై కేంద్రమంత్రి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్న గతంలో పట్టించుకోలేదని, లడ్డూలో జంతువులు కొవ్వును వినియోగించడం నీచమని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నామని, లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ చేసి క్షమించరాని నేరమని బండి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News