హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అభినవ గరళకంఠుడు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అభివర్ణించారు. శనివారం కర్ణాటక ఎన్నికల్లో భాగంగా చింతామణి అసెంబ్లీ నియోజకవర్గంలో కోలార్ ఎంపి మునిస్వామి, బిజెపి అభ్యర్ధి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సిహెచ్ విఠల్, సంగప్పలతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో నిర్వహిస్తూ బిజెపికి ఓటేయాలని అభ్యర్ధించారు.
Also Read: కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం మేలు: డికె అరుణ
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లుగా కంఠంలో దాచుకుంటూ ప్రజల కోసం పనిచేస్తూ దేశాన్ని అభివృద్ధిపై ప్రధాని నరేంద్రమోడీ నడిపిస్తున్నారని అన్నారు. ఓ వర్గం వాళ్ల ఇంటికిపోయి మల్లిఖార్జున ఖర్గే బొట్టును ఎందుకు చెరిపివేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బొట్టు చెరిపేసుకునే వాళ్ల పార్టీలకు కర్నాటక ప్రజలకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి ఏ మతానికి వ్యతిరేకం కాదు.. హిందూ దేవుళ్లను అవమానిస్తే, కుల, మతాల, వర్గాల పేరుతో చీల్చితే అడ్డుకునే పార్టీ అన్నారు.