Thursday, March 13, 2025

అన్నదాతల ఆక్రందనలు కనిపించడం లేదా?: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాలువల్లో నీళ్లు ఉన్న పొలాల్లోకి ఎందుకు వదలడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. పది లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శలు గుప్పించారు. గురువారం బండి మీడియాతో మాట్లాడారు. అన్నదాతల ఆక్రందనలు కనిపించడం లేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని అడిగారు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, పంటన నష్ట పరిహారం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి మాట్లాడడం కాదు రైతుల భవిష్యత్ గురించి ఆలోచన చేయాలని బండి కోరారు. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చలు జరిపి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి విషయం కేంద్రంపై నెట్టేయడం సరికాదని చురకలంటించారు. యాసింగ్ పూర్తయ్యే వరకు నీళ్లు వదలాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News