Tuesday, January 21, 2025

మోడీ మహారుషి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

వేములవాడ: ఆరు గ్యారంటీలతో మోసగించిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని కరీంనగర్ ఎంపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వేములవాడ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి గాడిద గుడ్డు తీసుకవస్తుందని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు ఇచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలు, ఆసరా పింఛన్లు ఇవ్వకుండా గాడిద గుడ్డు ఇచ్చిందని బండి సంజయ్ చురకలంటించారు. ఏ ప్రధాని వేములవాడను సందర్శించలేదని, మోడీ సందర్శించారని, పిఎం నరేంద్ర మోడీ పక్కా లోకల్.. అరడుగుల బుల్లెట్ అని ప్రశంసించారు.  మోడీకి కుట్రలు, కుతంత్రాలు తెలియవని, కొందరు మోడీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. మోడీ మీద పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని బండి సంజయ్ హెచ్చరించారు. నరేంద్ర మోడీకి ప్రధాని పదవి వద్దనుకుంటే భుజానికి సంచి వేసుకొని వెళ్లిపోయే మహారుషి అని మెచ్చుకున్నారు. .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News