Monday, December 23, 2024

సచివాలయంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా నాణ్యత లేకుండా పనులు చేస్తుండటంతో అగ్నిప్రమాదం జరిగివుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫైర్ సేఫ్టీ సహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News