Wednesday, January 22, 2025

Paper Leakage: టెన్త్ పేపర్ లీకేజీల వెనుక బండి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టెన్త్ పేపర్ లీకేజీల వెనుక బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కుట్రలో భాగంగానే బిజెపి లీకేజీలు చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ క్రీడ కోసం విద్యార్థుల జీవితాలతో బిజెపి చెలగాటం ఆడుతోందని, అధికారం కోసం బిజెపి నాయకులు ఎలాంటి దారుణానికైనా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట దొరికిపోతారని, బండి సంజయ్‌కు చదువు విలువ తెలియదని, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఇలాంటి నేతలకు తెలియదని జగదీష్ దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే బిజెపి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. త్వరలో పోలీసులు అన్ని విషయాలు బయటపెడుతారన్నారు. గత రాత్రి టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News