Thursday, January 23, 2025

ఓఆర్‌ఆర్ అవకతవకలపై సిఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ సంబంధిత వ్యవహారంపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు- బండి సంజయ్ కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన బహిరంగ లేఖ మంగళవారం రాశారు. ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు జరిగాయంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఓఆర్‌ఆర్ టెండర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి..?” అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

‘టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటు. ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి..? ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి. మీకు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణమే ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలి” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read: తిరుపతి వెళ్లే భక్తుల కోసం నాలుగు రోజుల టూర్ ఫ్యాకేజీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News