Tuesday, December 24, 2024

పొంగులేటిని బిజెపిలోకి ఆహ్వానిస్తున్నాం : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజెపిలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ చెప్పారు. ముఖ్యమంత్రి పాలనను వ్యతిరేకించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునేవాళ్లంతా బిజెపిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్‌తో విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. మేమంతా ఒక్కటే. మా అందరి లక్ష్యం ఒక్కటే. కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి బిజెపి పాలన తేవడమే మా ధ్యేయం”అని పునరుద్ఘాటించారు.

Also Read:ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి మృతదేహం..

పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం..
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. వారితో కలిసి కొద్దిసేపు కూర్చున్నారు. పంచాయతీ కార్యదర్శుల సమ్మె న్యాయబద్దమైనది. గ్రామాల అభివృద్ధిలో, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరి పాత్ర కీలకం. రాష్ట్రానికి అనేక అవార్డులు రావడం వెనుక వీరి శ్రమ ఉందన్నారు. కార్యదర్శుల ఉద్యోగాలను వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News