Monday, December 23, 2024

కుటుంబ సమేతంగా మోడీని కలిసిన బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతనంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఢిల్లీ లో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివి దేశానికి గొప్ప కీర్తిని తీసుకురావాలని పిల్లలను ఉద్దేశించి అన్నట్లు తెలిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా రేపు హైదరాబాద్ రానున్న బండి సంజయ్ ని బిజెపి శ్రేణులు ఎయిర్ పోర్టు నుండి ఘనంగా స్వాగతించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News