Tuesday, January 7, 2025

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యింది

- Advertisement -
- Advertisement -
టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్

హైదరాబాద్:  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ -అయ్యిందని, ఆయనేమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ కాంగ్రెస్‌ను కిరాణ దుకాణమంటూ విమర్శిస్తున్నారని, మరి మీ అంగడి పేరేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కిరాణ దుకాణం నుంచి బిజెపిలోకి చేర్చుకున్న వారిని ఏమిచ్చి కొన్నావో చెప్పాలని బండి సంజయ్‌ను ఆయన ప్రశ్నించారు.

బండికి కాంగ్రెస్‌ను విమర్శించడానికి కూడా పదాలు దొరకడం లేదన్నారు. తాము వాడిన పదాలనే తమపై విసురుతున్నారని నిరంజన్ వాపోయారు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఏమిటో బిజెపి నాయకుడు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి గురువారం చేసిన ట్వీట్‌తోనే స్పష్టమవుతుందన్నారు. ప్రధాని మోడీ మానసిక పరిస్థితి కూడా బండి సంజయ్ కంటే భిన్నంగా లేదన్నారు. ప్రధాని మోడీ హిందూ సంప్రదాయానికి భిన్నంగా అయోధ్యలో భూమి పూజ అర్ధాంగి ప్రక్కన లేకుండా నిర్వహించి అపచారం చేశారని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News