Sunday, January 5, 2025

ఈనెల 10న సిరిసిల్లో బండి సంజయ్ దీక్ష

- Advertisement -
- Advertisement -

తెలంగాణను పదేళ్లపాటు పాలించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కెసిఆర్ సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని, రైతులు, నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 10న సిరిసిల్లో ‘దీక్ష’ చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. కాగా నయీం ఆస్తులపై విచారణ జరపడంతో పాటు ఆస్తులను దోచుకున్న కెసిఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని విమర్శించారు. బిఆర్‌ఎస్ అవినీతిపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోదని, కాళేశ్వరం అక్రమాలపై కెసిఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని ఆక్షేపించారు. అందుకు ప్రతిఫలంగా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నిలదీయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలేది లేదని హస్తం పదేపదే చెబుతుందని, మరి కెసిఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఉందంటున్నారు కదా, మరి ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. రెండు పార్టీలు లోపల కుమ్కక్కై పైన డ్రామాలాడుతున్నయని ప్రజలు గమనించాలని బండి సంజయ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News