Saturday, December 21, 2024

కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు సినీ రంగానికి సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. బిజెపి అధికారంలోకి వస్తే ట్యాంక్‌బండ్‌పై కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సినీ రంగంలో విభిన్నగా ప్రయోగాలు చేసిన వ్యక్తిగా ఆయన గౌరవం అందుకున్నారని అన్నారు. బుధవారం కృష్ణ భౌతిక కాయానికి బండి సంజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

అనంతరం మీడియాతో సంజయ్ మాట్లాడుతూ.. భయమనే పదానికి అర్ధం తెలియకుండా సాహసమే ఊపిరిగా జీవితాంతం బతికారని కొనియాడారు. ఒకే సంవత్సరంలో 19 సినిమాలు తీసి ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన వ్యక్తిగా గుర్తింపు పొందారనారు. సినీ రంగంలో నిర్మాతలను ఆర్ధికంగా ఆదుకున్న హీరోగా కృష్ణ గొప్ప పేరు సంపాదించుకున్నారని అన్నారు. వివాదాలకు దూరంగా కృష్ణ కుటుంబం ఉందని, క్రమశిక్షణకు, మానవత్వానికి మంచి మనిషిగా ఆయన నిలిచారన్నారు. తెలుగు వెండితెరకు నూతన సాంకేతికతతో పాటు రంగుల చిత్రాలను పరిచయం చేసిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు.

Bandi Sanjay pays homage to Krishna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News