Wednesday, January 22, 2025

బిజెపి అధ్యక్షులు బండి పదవి పదిలం

- Advertisement -
- Advertisement -
పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్‌చుగ్ వెల్లడి

హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని గ్రూపు తగదాలు జరుగుతున్నట్లు చేస్తున్న ప్రచారం విపక్ష పార్టీల కుట్రేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇంచార్జీ తరుణ్‌చుగ్ పేర్కొన్నారు. రాష్ట్ర నాయకులందరూ కలిసికట్టుగానే ఉంటూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్ మార్పు ఉంటుందా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించారని ఒక అధ్యక్షుడి మార్పు ఎందుకు ఉంటుందని సమాదానం చెప్పారు. తుపాను ప్రభావం అనేక రాష్ట్రాలపై పడే అవకాశాలుండడంతో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రద్దు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News