Thursday, January 23, 2025

త్వరలో నిరుద్యోగ మార్చ్.. ప్రజల గొంతుకలకు మద్దతు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే మీడియా సంస్థలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌కు మద్దతుగా నిలవాలని పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలపై ప్రభావం చూపిందన్నారు.

తీన్మార్ మల్లన్నసహా సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ శాంపిల్ మాత్రమే, ప్రశ్నించే మీడియా సంస్థలను, పార్టీల అంతు చూస్తానని బిఆర్‌ఎస్ నేతలు వార్నింగ్ ఇవ్వడంలో భాగమే వారి అరెస్ట్ అన్నారు. ఈ అంశంపై న్యాయస్థానంలో పోరాడతామన్నారు.ప్రజల పక్షాన నిలుస్తూ ప్రశ్నించే మీడియా సంస్థలు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కు మద్దతుగా నిలవాలని బీజేపీ నిర్ణయం. క్యూ న్యూస్‌తో పాటు, కాళోజీ ఛానల్స్ కార్యాలయాలకు వెళ్లి సంఘీభావం తెలపాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఆయా ఛానల్ కార్యాలయాలను జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, క్రిష్ణప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News