Monday, December 23, 2024

సిఎలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి : బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఛార్టెట్ అకౌంటెంట్లు (సిఎ) తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఐసిఎఐ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యుపిఎ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, కాగ్ ఇచ్చిన నివేదికలతోనే 2జీ స్కాం, బొగ్గు స్కాంలు బయటపడ్డాయని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అడ్రస్సే గల్లంతైన విషయాన్ని గుర్తు చేశారు. సిఎ పట్టభద్రుల ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

ఈ దేశ ఆర్దిక ప్రగతిని బ్రాండ్ అంబాసిడర్లు.. నవ భారత జాతి నిర్మాతలు సిఎలని అభివర్ణించారు. తమ క్లయింట్ల విషయంలో నిజాయితీగా పనిచేయాలని, లాభాలొచ్చినా, నష్టాలొచ్చినా వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం సిఎలపై ఉందన్నారు. ప్రధాని మోడీ పాలనలో దేశం ఆర్థిక పురోగతి సాధించిందన్నారు. మోడీ చొరవతో 48.75 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో 2 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని వెల్లడించారు. ఆర్దిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి చేరుకుందన్నారు. కార్యక్రమంలో ఐసిఎఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News