Monday, January 20, 2025

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం

- Advertisement -
- Advertisement -

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్
హైదరాబాద్: అమెరికాలో నివసించే భారతీయులంతా మళ్లీ నరేంద్రమోడీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… “ఎన్నారైలకు ఏ సమస్య వచ్చినా మోడీ ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోందన్నారు. కేంద్రంతో పాటు తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావాలని ప్రవాస తెలంగాణ వాసులు కోరుకుంటున్నారని సంజయ్ చెప్పారు.

‘సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలొస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుంది. అందరూ స్వస్థలాలకు వెళ్తారు. అదే తరహాలో రాబోయే ఎన్నికల్లో అమెరికాలో నివాసముంటున్న తెలంగాణ వాసులంతా స్వరాష్ట్రానికి చేరుకుని బిజెపి పక్షాన ఎన్నికల ప్రచారం చేస్తామని, మళ్లీ మోడీ ప్రభుత్వం రావాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తామని యూఎస్ లోని ఎన్నారైలంతా హామీ ఇచ్చారు.”అని ఆయన పేర్కొన్నారు. స్వాగతం పలికిన వారిలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, మీసాల చంద్రయ్య, ఆకుల విజయ, నందీశ్వర్ గౌడ్, టి.వీరేందర్ గౌడ్, దేశ్ పాండే, బొమ్మ శ్రీరాం, బుక్కా వేణుగోపాల్, ఆకుల శ్రీవాణి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News