Wednesday, January 22, 2025

ప్రశ్నిస్తే..అరెస్ట్ చేస్తారా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ఎదుట ఆందోళన చేసిన యువమోర్చా కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బిజెవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బిజెపి కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని, అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు.

తక్షణమే అరెస్ట్ చేసిన బిజెవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని గుర్తు చేశారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై పార్టీ తరుపున టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
బిజెవైఎం కార్యకర్తల అరెస్ట్ అప్రజాస్వామికం : డికె అరుణ
ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బిజెవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపుతూ నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కును కాలరాసేలా బిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News